YOUTH | భారీ.. జాబ్ మేళా

YOUTH | భారీ.. జాబ్ మేళా


YOUTH | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు ది.12.12.2025 శుక్రవారం ఉదయం 09:00 గంటలకు మచిలీపట్నంలోని SSR డిగ్రీ కళాశాలలో (Degree College) “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజి తెలియజేసారు. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్ ను జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె.బాలాజీ, ఐఏఎస్ కలెక్టరేట్ లోని వారి ఛాంబర్ లో ఆవిష్కరించారు.

ఈ జాబ్ మేళాలో దెక్కన్ ఫైన్ కెమికల్స్ ఇండియా లిమిటెడ్, జోయాలుక్కాస్ జ్యూవెలరీ, యాక్సిస్ బ్యాంక్, టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్వెస్ కార్ప్ లిమిటెడ్, ఎన్ఎస్ (NS) ఇన్స్ట్రుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, కోల్గేట్-పాల్మొలివ్ లిమిటెడ్, గోల్డ్ ప్రిన్స్ జ్యూవెల్ ఇండస్ట్రీ ఇండియా, రిలయన్స్ డిజిటల్, బెటర్ కాస్టింగ్స్, జస్ట్ డయల్ లిమిటెడ్, అపోలో ఫార్మసి, మోహన్ స్పింటెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అమర రాజా గ్రూప్ వంటి ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని ఉపాధి అధికారి/డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డి.విక్టర్ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి Dr. పి.నరేష్ కుమార్ తెలిపారు.

ఈ కంపెనీలలో ఉద్యోగాలకు (Job) టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, ఫార్మసి పూర్తి చేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు యువత అర్హులని, ఎంపిక అయిన వారికి మంచి వేతనం, ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు, డిసెంబర్ 12న నిర్వహించబోయే జాబ్ మేళాకు హాజరైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

ఆసక్తి, తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/user-registration లింక్ నందు తప్పనిసరిగా తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ చేయించుకోవాలి. సదరు జాబ్ మేళాకు రెజ్యూమె లతో లేదా బయోడేటా ఫోరమ్ లతో పాటు ఆధార్, ఆధార్ కు లింక్ అయిన ఫోన్ నంబర్, PAN, సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9966489796, 6300618985, 9989519495 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

Leave a Reply