CITU | కార్మికుల సమస్యలు..

CITU | కార్మికుల సమస్యలు..


CITU | గుడివాడ, ఆంధ్రప్రభ : ఈ నెల 31వ తారీఖు నుండి 2026 జనవరి 4వ తారీఖు వరకు సీఐటీయు (CITU) అఖిల భారత 18వ మహాసభలు నిర్వహించనున్నారు. ఈ మహాసభలను కార్మికులు జయప్రదం చేయాలని బుధవారం కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో భవన నిర్మాణ కార్మికుల అడ్డ నేలమాల్ సెంటర్లో పోస్టర్లు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయు అనుబంధం గుడివాడ (Gudivada) పట్టణ కార్యదర్శి రేపానీ కొండ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు భవన నిర్మాణ కార్మికుల సమస్యలు మేము పరిష్కరిస్తాం అని చెప్పారు. అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని కొనసాగిస్తాం.. సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. అయితే.. కూటమి ప్రభుత్వం ఇంత వరకు ఈ కార్మికుల సమస్యలు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని, కార్మికులకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోడులను తెచ్చి కార్మికులకు ఇబ్బందులు పెట్టే పరిస్థితుల్లో ఈ 4 కోడ్లు ఉన్నాయని భవన నిర్మాణ కార్మికుల దృష్టికి తీసుకువెళ్లారు.

భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డుని తక్షణమే కొనసాగించాలని.. కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని భవన నిర్మాణ కార్మికులకు పెండింగ్లో ఉన్న క్లైములు విడదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ కమిటీ సభ్యులు (committee members) మొడెడ్ల నారాయణరావు, ఆంధ్రప్రదేశ్ వడ్డెర ఉత్తదారుల సంఘం పట్టణ ఉపాధ్యక్షులు బండి శీను, బండారి బాలాజీ, బత్తుల వీరయ్య, శంకర్, పెద్దిరాజులు, భవన నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply