Observer | ఎన్నికల వేళ అధికారులు అలర్ట్‌గా ఉండాలి..

Observer | ఎన్నికల వేళ అధికారులు అలర్ట్‌గా ఉండాలి..

  • విస్తృత తనిఖీలు చేపట్టండి..
  • ఎన్నికల ప్రవర్తన నియమావలి ఉల్లాంఘాన కాకూడదు ..
  • ఎన్నికల అబ్సర్వర్ రవి కిరణ్..
  • జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్..

Observer | జనగామ, ఆంధ్రప్రభ : ఎన్నికలను పారదర్శకం గా నిష్పాక్షికంగా నిర్వహించడంలో ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి బృందాల పాత్ర కీలకంగా ఉంటుందని జనరల్ అబ్సర్వర్(Observer) రవి కిరణ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఈ రోజు ఎన్నికల ప్రవర్తన నియమావలి అమలు పై ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి బృందాలు, తహసీల్దార్ లతో కలెక్టరెట్ లోని కాన్ఫెరెన్స్ హాల్ లో ఎన్నికల అబ్సర్వర్, జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్బంగా ఎన్నికల అబ్సర్వర్ రవికిరణ్ మాట్లాడుతూ.. పోలింగ్ సమయంలో నగదు, మద్యం తదితర వాటిని చూపెట్టి ఓటర్లను ప్రలోబాలకు గురి చేయకుండా పోలింగ్(polling) అయిపోయే వరకు అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి సజావుగా అమలు కావాలంటే ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి బృందాలు క్షేత్ర స్థాయి లో విస్తృత తనిఖీలు చేపట్టాలన్నారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కాకుండా చూడాలని లా అండ్ ఆర్డర్ సమస్య లు ఎక్కడ రావద్దని రెండు రోజుల పాటు ఎక్కువ నిఘా పెట్టాలన్నారు. జిల్లా ఎన్నికల అధికారి(District Election Officer), కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ ప్రచార సమయం అయిపోగానే ఎక్కడ మీటింగ్ లు జరగకుండా చూడాలన్నారు. ఎం సి సి ఆంక్షల మీద గ్రామ పంచాయతీ లలో టామ్ టామ్ వేపించాలన్నారు.

ఉప సర్పంచ్ ఎన్నిక అయిపోయంత వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలను పక్కాగా పాటించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి(Rules) అతిక్రమణ సంబంధిత ఫిర్యాదులు, బెదిరింపులు, మద్యం పంపిణీ సంఘ విద్రోహ చర్యలు, పరిమితిని మించి ధనాన్ని వ్యయం చేయడం తదితర అంశాలను ఈ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌(E-Flying Squad) బృందాలు నిషితం గా పరిశీలించాలన్నారు.

ఎక్కడైనా ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమిస్తున్నట్లు సమాచారం అందగానే వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు ఈ రివ్యూ లో డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఏసీపీ పండరి చేతన్, ఎం సి సి నోడల్ ఆఫీసర్ విక్రమ్, తహసీల్దార్ లు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply