టీచర్ల కొరత తీర్చండి..

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నెలకొన్న ఉపాధ్యాయుల కొరతను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మండల విద్యాశాఖాధికారి (ఎంఈవో)కి వినతిపత్రం అందజేశారు. జిల్లా ఎన్ఎస్యుఐ ఉపాధ్యక్షుడు సయ్యద్ రహమాన్ ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ నాయకులు ఎంఈవోను కలిసి సమస్యలను వివరించారు.
పట్టణంలోని బస్టాండ్‌కు ఎదురుగా ఉన్న గవర్నమెంట్ హైస్కూల్‌లో టీచర్ల కొరత తీవ్రంగా ఉందని, దీనివల్ల విద్యార్థులు భారీ నష్టం ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు.
స్కూల్ అసిస్టెంట్లతో పాటు హిందీ టీచర్, ఆంగ్లమాధ్యమం కోసం హిందీ బోధించే ఉపాధ్యాయులు అందుబాటులో లేరని పేర్కొన్నారు. అలాగే తెలుగు, గణితం, సాంఘిక శాస్త్రం మరియు ఉర్దూ మీడియం కోసం ఉపాధ్యాయుల లోటు కారణంగా విద్యార్థులు నష్టపోతోందని వివరించారు.
టీచర్ల కొరతతో పాటు పాఠశాలలో కిచెన్ సెంటర్ కూడా లేకపోవడం సమస్యగా ఉందని నాయకులు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా తగిన ఉపాధ్యాయులను వెంటనే నియమించాలని, అవసరమైన సౌకర్యాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎంఈవోను కోరారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ భీంగల్ జనరల్ సెక్రటరీ రాజేష్, హర్ష, నిఖిల్, ప్రకాష్, నందు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
