ధర్మపురి, ఆంధ్రప్రభ : బుద్దేష్‌పల్లి సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి రేణుక బుచ్చవ్వ, గ్రామ ప్రజలు తనకు ఒకసారి అవకాశం కల్పించి గెలిపించాలని కోరారు. మంగళవారం ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. తన భర్త గతంలో ధర్మపురి మేజర్ గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్‌గా పనిచేసిన అనుభవం ఉన్నందున, ఆ అనుభవం గ్రామాభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పారు. బుద్దేష్‌పల్లి ప్రజలు తనను ఒకసారి సర్పంచ్‌గా అవకాశం ఇస్తే, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని రేణుక హామీ ఇచ్చారు. గ్రామంలో ప్రతినిత్యం అందుబాటులో ఉంటానని, సమస్యల పరిష్కారానికి ఎప్పుడైనా ముందుండి పనిచేస్తానని ఆమె భరోసా ఇచ్చారు.
సర్పంచ్‌గా ఒకసారి అవకాశం కల్పించండి..

