Kadem | సర్పంచ్‌గా ఒక్కసారి అవకాశం కల్పించండి

Kadem | సర్పంచ్‌గా ఒక్కసారి అవకాశం కల్పించండి

  • ఉడుంపూర్ సర్పంచ్ అభ్యర్థి కాశవేణి తిరుపతి యాదవ్

Kadem | క‌డెం, ఆంధ్రప్రభ : ఉంగరం గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించి.. ఒక్క‌సారి అవకాశం కల్పించాలని ఉడుంపూర్ గ్రామ పంచాయ‌తీ సర్పంచ్ అభ్యర్థి కాశవేణి తిరుపతి యాదవ్ అన్నారు. మంగళవారం కడెం మండలం ఉడుంపూర్ గండి గోపాల్ పూర్ మిద్ద చింత మైసంపేట్ రాంపూర్ గ్రామాల్లో కడెం మండలం ఉడుంపూర్ సర్పంచ్ అభ్యర్థి కాశవేణి తిరుపతి యాదవ్ పలు వీధుల గుండా పర్యటిస్తూ గడపగడపకు వెళ్లి ఓటర్లను, ప్రజలను కలుస్తూ తమ ఉంగరం గుర్తును చూపిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈనెల11 న జరిగే ఎన్నికల్లో తమను గెలిపిస్తే ఉడుంపూర్ గ్రామ‌పంచాయ‌తీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply