Servant | ఐదేళ్లు సేవకుడిగా పని చేస్తా

Servant | ఐదేళ్లు సేవకుడిగా పని చేస్తా
Servant | మంథని, ఆంధ్రప్రభ : అడవి సోమన్ పల్లి గ్రామంలో జనం ప్రభంజనంలా బాపన్న వెంట ప్రచారం నిర్వహించే దృశ్యాలు విజయయాత్రను తలపిస్తున్నాయి. మంథని మండలం అడవి సోమన్ పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి కొఠారి బాపు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం ఖాయమని ప్రజలంతా చర్చించుకుంటున్నారు.
ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటెయ్యండి, ఐదేళ్లు సేవకుడి(Servant)గా పని చేస్తానని ఆయన తెలియచేస్తున్నారు. ఆయన ప్రచారానికి ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు.
ఆయన తరపున ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులు ప్రచారం చేయడం విశేషం. స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటెయ్యండి.. ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని అడవి సోమన్ పల్లి సర్పంచ్ అభ్యర్థి కొఠారి బాపు పేర్కొన్నారు.
ప్రచారంలో ఆయన గడప గడపకు ప్రచారం చేస్తూ.. దూసుకు వెళ్తున్నారు. అడవి సోమన్ పల్లి ఎన్నికల్లో(election) గెలుపు నాదే, ప్రజల అభివృద్ధి బాధ్యత నాది అని ఆయన హామీ ఇస్తున్నారు.
ప్రజల సహకారంతో గెలవడం ఖాయమని, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు అండతో గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని ఆయన అన్నారు. గతంలో సర్పంచ్ గా.. తన సతీమణి హయాంలో గ్రామానికి 228 ఇందిరమ్మ ఇండ్లను, మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) సహకారంతో మంజూరు చేయించినట్లు గుర్తు చేశారు.
వచ్చే ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని, మరోసారి అవకాశం కల్పిస్తే మంథని మండలంలోని అడవి సోమన్ పల్లి గ్రామాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నారు.
