Parakala | సర్పంచ్ అభ్యర్థి పసుల బిక్షపతి విస్తృత ప్రచారం
- ప్రచారంలో బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
- విజయోస్తు అంటూ దీవిస్తున్న మహిళలు
Parakala | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మండలంలోని పైడిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ పార్టీ బలపరిచిన పసుల బిక్షపతి గ్రామంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. గ్రామంలోని ఓటర్లు, మహిళలు, వృద్ధులు, యువకులు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సర్పంచ్ అభ్యర్థి పసుల బిక్షపతికి బ్రహ్మరథం పడుతూ దీవిస్తున్నారు. గ్రామంలోని సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండడం, గ్రామ సర్పంచ్ గా గెలిపించుకుంటే గ్రామంలో అభివృద్ధి అంచెలంచెలుగా జరుగుతుందని ఇక్కడి ప్రజలు గ్రహిస్తున్నారు.
ప్రచారంలో భాగంగా తనకు అవకాశం కల్పించి.. సర్పంచుగా ఎన్నుకుంటే గ్రామంలోని మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని అభ్యర్థి పసుల బిక్షపతి ఓటర్లకు తెలియజేస్తూ, తనకు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ప్రచారంలో వారి వెంట పైడిపల్లి మాజీ సర్పంచ్ సరిత సురేష్, పైడిపల్లి గ్రామ ఏడవ వార్డు అభ్యర్థి బొచ్చు అవినాష్, గ్రామంలోని బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

