Lakshmipuram | గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తాం…

Lakshmipuram | గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తాం…


సర్పంచ్ అభ్యర్థి పుట్ట సరిత రాజు ప్రచారం

Lakshmipuram | పరకాల, ఆంధ్రప్రభ : లక్ష్మీపురం గ్రామాన్ని ప్రగతి పదంలో అభివృద్ధి చేస్తామని లక్ష్మీపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థి పుట్ట సరిత రాజు అన్నారు. ఇవాళ గ్రామంలో ముమ్మర ప్రచారం నిర్వహించారు. పరకాల మండలంలోని లక్ష్మీపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గ్రామంలో ప్రచారం ముమ్మరం చేశారు.

గ్రామంలోని ఓటర్లు, మహిళలు, వృద్ధులు, యువకులు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సర్పంచ్ అభ్యర్థి పుట్ట సరిత రాజుకు బ్రహ్మరథం పడుతూ దీవిస్తున్నారు. గ్రామ సర్పంచ్ గా గెలిపించుకుంటే గ్రామంలో అభివృద్ధి అంచెలంచెలుగా జరుగుతుందని ఇక్కడి ప్రజలు గ్రహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా తనకు ఒకసారి అవకాశం కల్పించి సర్పంచిగా ఎన్నుకుంటే గ్రామంలోని మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని అభ్యర్థి పుట్ట సరిత రాజు ఓటర్లకు తెలియజేస్తూ అభ్యర్థిస్తున్నారు.

అధికార కాంగ్రెస్ పార్టీ సహకారంతో లక్ష్మీపురం గ్రామానికి నిధులు తీసుకువచ్చి గ్రామ అభివృద్ధికి పాటు పడతామన్నారు. ప్రచారంలో వారి వెంట గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు పల్లెబోయిన శ్రీనివాస్, నాయకులు కుమార్, కార్యకర్తలు, అభిమానులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply