శ్రీశైలంలో విషాదకర సంఘటన బుధవారం చోటు చేసుకుంది.శ్రీశైలం డ్యామ్ దిగువన ఉన్న కృష్ణా నదిలో స్నానమాచరిస్తూ తండ్రీకొడుకులు మృతి చెందారు. ఈ ఘటన నేటి ఉదయం జరిగింది. భార్య, కొడుకుతో కలిసి మల్లన్న దర్శనార్థం వచ్చారు. లింగాలగట్టు పెద్ద బ్రిడ్జి కింద కొడుకు స్నానమాచరిస్తూ నదిలోకి వెళ్లిపోయాడు. అది గమనించిన తండ్రి అతడిని కాపాడే ప్రయత్నంలో ఇరువురూ మృతి చెందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Srisailam | పాతాళ గంగలో మునిగి తండ్రీకొడుకులు మృతి
