Indaram | నిరంతరం కృషి చేస్తా..

Indaram | నిరంతరం కృషి చేస్తా..
Indaram, జైపూర్, ఆంధ్రప్రభ : జైపూర్ మండలం ఇందారం గ్రామ సర్పంచ్ ఎన్నికల బరిలో పోటీ చేస్తున్న కొరివి శేఖర్.. తనని అత్యధిక మెజార్టీతో ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు. బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా తనకు ఒక్క అవకాశం ఇస్తే.. తను గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు. గ్రామంలో ఉన్ననిరుద్యోగ యువతకు ఉపాధి, నూతన రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని సర్పంచ్ అభ్యర్థి కొరివి శేఖర్ ప్రజలకు హామీ ఇచ్చారు. తనతో పాటు అన్ని వార్డుల అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
