surabhi group| రాష్ట్రంలో రూ. 3 వేల కోట్ల పెట్టుబడి

surabhi group| రాష్ట్రంలో రూ. 3 వేల కోట్ల పెట్టుబడి
ప్రభుత్వంతో ఎంఓయు
1000 మందికి ఉపాధి
గ్రీన్ ఎనర్జీ రంగంలోకి సురభి గ్రూప్
పెద్దపల్లి జిల్లాలో పరిశ్రమ
surabhi group| పెద్దపల్లి ఆంధ్రప్రభ గ్రీన్ ఎనర్జీ సెక్టార్ లో పెట్టుబడులు పెట్టేందుకు సురభి గ్రూప్స్ ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ లో సురభి గ్రూప్ ఎస్ఎల్ఆర్ పవర్ చైర్మన్ సురభి హరేందర్ రావు రాష్ట్రంలో 3 వేల కోట్ల పెట్టుబడి తో పెద్దపల్లి జిల్లాలో పరిశ్రమ స్థాపనకు ప్రభుత్వంతో ఎంఓయు కుదుర్చుకున్నారు. సోమవారం హైదరాబాదులో జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి మల్లు విక్రమార్క కు ఎంఓయు పత్రాలను అందజేశారు.
surabhi group | వెయ్యి మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి

ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ సురభి గ్రూప్స్ గ్రీన్ ఎనర్జీ సెక్టార్లో భాగంగా పెద్దపల్లి జిల్లా సుగ్లాంపల్లి లో 3000 కోట్ల రూపాయల పెట్టుబడితో సోలార్ సెల్, ప్యానెల్ తయారీ పరిశ్రమను నెలకొల్పుతున్నారన్నారు. ఈ పరిశ్రమ నిర్మాణం వల్ల వెయ్యి మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించనుందన్నారు. ఏడాది కాలంలో పరిశ్రమ నిర్మాణం పూర్తవుతుందని, గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన సురభి గ్రూప్స్ చైర్మన్ హరిందర్ రావును అభినందించారు.
