Venkateswar | బీజేపీ అభ్యర్థులను గెలిపించండి

Venkateswar | బీజేపీ అభ్యర్థులను గెలిపించండి

జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్

Venkateswar | చెన్నూర్, ఆంధ్రప్రభ : మరి కొద్దిరోజుల్లో జరుగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో బీజేపీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగనూరి వెంకటేశ్వర్ గౌడ్ కోరారు. చెన్నూరు మండలంలోని పలు గ్రామాల్లో జిల్లా కార్యదర్శి దుర్గం అశోక్ తో కలిసి పర్యటించారు. ఈసంద‌ర్భంగా కిష్టంపేటలో మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంద‌న్నారు. గతంలో సంకారం గ్రామ అటవీ ప్రాంతంలో ఇద్దరు పిల్లలు రహదారిపై ప్ర‌మాదంలో మరణించారని, ఆ సంఘటనకు స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం చెన్నూరు పట్టణం నుంచి బుద్దారం వరకు ప్రధానమంత్రి సడక్ యోజన కింద తారు రోడ్ నిర్మాణం చేపట్టడం జరిగిందని గుర్తుచేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు.

Leave a Reply