Farmer Barossa | బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి

Farmer Barossa | బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి

మాజీ ఎమ్మెల్యే మరి జనార్ధన్ రెడ్డి


Farmer Barossa | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ నియోజకవర్గం తెలకపల్లి మండలం పెద్దపల్లి గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జయరాంకు మద్దతుగా ప్రచారంలో మాజీ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహిళలకు నెలకు రూ.2500లు రెండేళ్లుగా రూపాయి కూడా గతి లేదన్నారు. రైతు రుణమాఫీ ఆగమాగమ‌న్నారు. పత్తికి ధరలేదు, వడ్లకు ధర లేదు, బోనస్ గతి లేదు, రైతు బరోసా లేదు, కౌలు రైతులకు రూ.12000లు లేవు, వ్యవసాయ కూలీలకు లేవు, ఒక్క ఫ్రీ బస్ తప్ప ఏం లేదన్నారు. కేసీఆర్ కిట్ బంద్ చేశారు.. న్యూట్రీషియన్ కిట్ బంద్ చేశారని, రైతు భీమా బందు చేశారన్నారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ను స్థానిక సంస్థల ఎన్నికల్లో బోంద పెట్టాలి ఆరోపించారు.

చివరకు యూరియా కోసం రైతులు చెప్పులు లైన్ లో పెట్టి ఇబ్బందులు పడ్డ రోజులు మాత్రం తెచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామంలో వీధి లైట్ పోతే మళ్లీ పెట్టే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన ట్రాక్టర్స్ అన్ని మూలన పడ్డాయని, చివరకు గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని విమర్‌శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply