Government | అంబేద్కర్ వారసురాలిగా …

Government | అంబేద్కర్ వారసురాలిగా …

  • వస్తున్నా… బాధ్యతాయుతమైన పాలన అందిస్తా
  • గెలుపు బాటలో పోట్ల లక్ష్మి వెంకటి …

Government | మంథని, ఆంధ్రప్రభ : మంథని మండలం మల్లారం స్థానిక సంస్థ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పొట్ల లక్ష్మీ వెంకటి బరిలో ఉన్నారు. గ్రామస్తులు ఈసారి ఎన్నికల్లో పొట్ల లక్ష్మీ వెంకటి సర్పంచిగా గెలిపించుకుంటామని ఆమె తరపున ప్రచారమే చేస్తున్నారు. సర్పంచ్ గా గెలిచిన తర్వాత గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ(Government welfare) పథకాలు అమలు చేస్తానని ఆయన తెలిపారు. బ్యాటు గుర్తుకు ఓటెయ్యండి, బాధ్యతాయుతమైన పరిపాలన ప్రజలకు అందజేస్తానని ఆమె వివరించారు.

గ్రామంలో రోడ్ల మరమ్మత్తులు, డ్రైనేజీ పునరుద్ధరణ, సంక్షేమ పథకాలు అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానని ఆమె వివరించారు. పొట్ల లక్ష్మీ వెంకటి ప్రచార యాత్రలో ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు. పొట్ల లక్ష్మీ వెంకటికి మద్దతుగా ప్రజలే ఇంటింట ప్రచారాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.

గడపగడపకు తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ పొట్ల లక్ష్మీ వెంకటి స్థానిక సంస్థల(local bodies) బరిలో నిలిచారు. ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిచి ప్రజాసేవకు ముందు ఉంటానని ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని ఆమె తెలిపారు. ఎన్నికల్లో ఆశీర్వదించి, అవకాశం కల్పించాలని సేవకునిగా పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు.

కష్టపడే వారిని ప్రజలు గుర్తించాలని, ప్రజల కోసం పనిచేసే వారు ఎవరో ప్రజలే తెలుసుకోవాలని ఆమె హితవు పలికారు. ఎన్నికల్లో బ్యాట్ ప్రభంజనం(bat Prabhanjan) కొనసాగుతుందని ప్రజలే బహిరంగంలో చెప్పడం కోసం మెరుపు. ఈసారి ఖచ్చితంగా పొట్ల లక్ష్మీ వెంకటి గెలవడం ఖాయమని గ్రామస్తులు విశ్వసిస్తున్నారు.

Leave a Reply