2023 Assembly elections | సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు..
2023 Assembly elections | కర్ణాటక, ఆంధ్రప్రభ : సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు వచ్చాయి.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో(2023 Assembly elections) వరుణ నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన ఎన్నిక చెల్లదని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసింది.
సిద్ధరామయ్య వరుణ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎన్నికను సవాల్ చేస్తూ కె.శంకర అనే వ్యక్తి పిటిషన్ దాఖలు(petition was filed) చేశారు. ఈ ఎన్నిక చెల్లదని, 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా సిద్ధరామయ్య అవినీతికి పాల్పడ్డారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ముఖ్యమంత్రికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణకు రిజిస్టర్ అయింది.

