Indian Gas | శత జయంతి వేడుకలు…
Indian Gas | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి దివిసీమ గాంధీ స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు సోమవారం అవనిగడ్డ నియోజకవర్గ ఇండియన్ గ్యాస్(Indian Gas) డీలర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
అవనిగడ్డ వంతెన సెంటర్లో కృష్ణారావు విగ్రహానికి నియోజకవర్గ యువనాయకులు, మండలి వెంకట్రామ్, ఇండియన్ గ్యాస్ డీలర్లు మత్తి శ్రీనివాసరావు, జీ.ఎస్.ఆర్.కే. అర్జునరావు, లక్ష్మీ ఫణింద్ర పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.
మండలి వెంకట కృష్ణారావు శత జయంతి కమిటీ, గాంధీ క్షేత్రం మండలి అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాగాయలంక డీసీ చైర్మన్ బండ్రెడ్డి నాగ మల్లికార్జునరావు (చినబాబు), టీడీపీ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, జనసేన ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, టీడీపీ టౌన్ అధ్యక్షుడు అన్నపరెడ్డి లక్ష్మీనారాయణ(Annapareddy Lakshminarayana), డీసీ వైస్ చైర్మన్ బచ్చు రఘునాథ ప్రసాద్, టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మాచవరపు ఆదినారాయణ, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజనాల వీరబాబు, పీఏసీఎస్ చైర్మన్లు యలవర్తి చిన్నా, మాదివాడ రత్నారావు, శ్రీ లంకమ్మ దేవస్థానం చైర్మన్ అన్నపరెడ్డి వెంకటస్వామి, శివాలయం చైర్మన్ ఘంటసాల రాజమోహనరావు (కన్నయ్య), దివిసీమ లలిత కళా సమితి ప్రధాన కార్యదర్శి కూనపరెడ్డి చంద్రశేఖర్ పాల్గొన్నారు.

