Elections | ప్రజాస్వామ్యంలో ఓటరు కీలకం..

Elections | ప్రజాస్వామ్యంలో ఓటరు కీలకం..
- జిల్లా ఎస్పీ డీ.వీ.శ్రీనివాస రావు
Elections | మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటరు కీలకమని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు అన్నారు. సోమవారం మెదక్ జిల్లాలో శాంతియుతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు(elections) జరిగేందుకు ప్రతి ఓటరు సహకరించాలని జిల్లా విజ్ఞప్తి చేశారు. మీ పేరు తాజా ఓటర్ జాబితాలో ఉన్నదో లేదో తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. పోలింగ్ స్టేషన్(Polling station) వివరాలను ముందుగానే తెలుసుకోవాలన్నారు.
పోలింగ్ రోజున ఓటర్ ఐడి ఇతర వ్యాలిడ్ ప్రభుత్వ ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. తెలియని వ్యక్తులకు ఓటర్ ఐడి లేదా ఓటర్ స్లిప్ ఇవ్వకూడదన్నారు. పోలింగ్ కేంద్రంలో క్యూలో(Q) నిలబడి సిబ్బంది సూచనలు పాటిస్తూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రం పరిసరాల్లో ముఖ్యంగా 100 మీటర్ల పరిధిలో ప్రచారం పూర్తిగా నిషేధించడం(forbidding) జరిగిందన్నారు. ఎవరు ప్రచారం చేసినా, బెదిరించినా, మభ్యపెట్టినా వెంటనే సమీప పోలీసు సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు. వికలాంగులు, వృద్ధులు, మహిళలకు ముందుగా ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పించడం జరిగిందన్నారు.
వేరొకరి పేరు మీద ఓటు వేయడానికి ప్రయత్నించడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు(Strict measures) తీసుకుంటామని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద గుమిగూడడం నిషేధమని, ఉల్లంఘనలపై చర్యలు తీసుకోబడతాయన్నారు. కౌంటింగ్ అనంతరం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలంటే ముందస్తు అనుమతి(Prior approval) తప్పనిసరి అని వివరించారు. సౌండ్ సిస్టమ్, బాణాసంచా వినియోగం కోసం పోలీసు అనుమతి తప్పనిసరి అని తెలిపారు. ఎన్నికలు శాంతియుతంగా జరగేందుకు నియమాలు పాటిస్తూ, ప్రజాస్వామ్య హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
