Grain | ఆందోళన వద్దు..
Grain | గన్నవరం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తుందని రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు (Yarla Gadda Venkatrao) పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గంలోని వేలేరులో రోడ్డు పై ఆరబెట్టిన ధాన్యంను ఎమ్మెల్యే పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాతావరణ పరిస్థితులు మారిన నేపథ్యంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రతి గింజను కొనుగోలు చేసేలా కృషి చేస్తానని తెలిపారు. ఎన్ని రోజుల నుంచి ధాన్యాన్ని ఆరబెడుతున్నారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.

