Chandrababu | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఉమ్మడి కుటుంబంలో సామాన్యురాలైన ఓ గ్రామ సర్పంచ్ ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలు, తమ కుల సమస్యలను విన్నవించిన సంఘటన శనివారం జరిగింది. ఉమ్మడి కూటమి ప్రభుత్వం(Joint coalition government)లోని సాధ్యమైందని ఆమె తెలిపారు. వివరాల మేరకు… నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం లక్ష్మాపురం గ్రామ సర్పంచ్ బేడ బుడగ జంగం సిరిగిరి సుజాత(Sirigiri Sujatha) శనివారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి చొరవతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కలిసి సమస్యలు విన్నవించారు.
నందికొట్కూరు నుండి పగిడ్యాల వెళ్లే రహదారి మొత్తం డ్యామేజ్ అయ్యి గుంతల గుంతలుగా ఏర్పడిందని, దీనివల్ల ప్రయాణికులకు యాక్సిడెంట్లు జరుగుతున్నందు వల్ల చాలామంది ప్రజలు ప్రాణాలు(People are survivors) పోగొట్టుకుంటున్నారని సీఎంకు వివరించారు. మాకు డబల్ రోడ్డు మంజూరు చేయించి ప్రమాదాల నుండి కాపాడవలసిందిగా సీఎం చంద్రబాబునాయుడుకు వినతి అందించారు. అలాగే రాష్ట్రంలో మా బేడ బుడగ జంగాల ప్రజలు ఎలాంటి క్యాస్ట్ రిజర్వేషన్(Caste reservation) లేనందువల్ల విద్యార్థులు విద్యాపరంగా ఉన్నత చదువులు చదువుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు.
కాబట్టి మా బేడ బుడగ జంగాల ప్రజలకు త్వరగా ఎస్సీ సర్టిఫికెట్లు జారీ చేసే విధంగా కేంద్రప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి మా కులానికి న్యాయం చేయాలని ముఖ్యమంత్రికు వినతిపత్రం ద్వారా కోరారు. మా లక్ష్మాపురం గ్రామానికి మంచినీటి సౌకర్యం(Fresh water facility) కొరకు కొత్తగా ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్(OHSR tank) ఏర్పాటు చేయాలని సర్పంచ్ సీఎం చంద్రబాబు నాయుడును కోరగా త్వరలోనే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగిందని సర్పంచ్ తెలిపారు. సీఎం చంద్రబాబును కలిసి సమస్యలు తెలుపుకునేందుకు ఎంపీ సహకరించారని సర్పంచ్ సుజాత తెలిపారు.

