TRS | అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వండి
- ప్రచారంలో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థి ధర్పల్లి అనసూయ యాదయ్య
- విజయం నీదేనంటూ ఓటర్ల దీవెనలు
TRS | నవాబుపేట, ఆంధ్రప్రభ : లొకిరేవ్ గ్రామాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వండి అంటూ ఓటర్లను వేడుకుంటున్నారు లోకరేవు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ధర్పల్లి అనసూయ యాదయ్య. గ్రామంలో గడప గడపకు ప్రచారం చేస్తూ తన కత్తెర గుర్తుకు ఓటు వేసి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఈప్రచార కార్యక్రమంలో భాగంగా అభ్యర్థికి గ్రామ ఓటర్లు అడుగడుగునా నీరాజనం పలుకుతూ విజయం నీదేనంటూ దీవెనలు ఇస్తున్నారు. అభ్యర్థికి సమస్యల పట్ల అవగాహన ఉందని, సర్పంచ్ గా తనను గెలిపిస్తే ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచి, గ్రామంలో మురికి కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణాలను పూర్తి చేసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందు ఉంచుతానని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

