Ayyappa | స్వామి దర్శనానికి వెళితే..

Ayyappa | స్వామి దర్శనానికి వెళితే..

దత్తిరాజేరు (విజయనగరం), ఆంధ్రప్రభ : తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం వద్ద జరిగిన కారు ప్రమాదంలో విజయనగరం (Vijayanagaram) జిల్లాకు చెందిన నలుగురు అయ్యప్ప స్వాములు మృతి చెందారు. శుక్రవారం అర్ధరాత్రి 2.15 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయ్యప్ప శబరిమలై దర్శనం కోసం వెళ్లిన స్వాములు దర్శనం పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రామేశ్వరం దగ్గరలో అయ్యప్ప స్వాములు ఆగి ఉన్న కారును మరో కారు డీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో దత్తిరాజేరు మండలం కోరపు కొత్తవలస గ్రామానికి చెందిన వంగర రామక్రష్ణ (51), మార్పిన అప్పలనాయుడు (33), మరడ రాము(50), గజపతినగరం మండలం మరుపల్లి గ్రామానికి చెందిన బండారు చంద్ర రావు (35) మృతి చెందినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో మరొకరు గాయపడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కొత్తవలస, మరుపల్లి గ్రామాలలో అయ్యప్ప స్వాములు మృతి వార్త తెలిసి కుటుంబ స‌భ్యులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

Leave a Reply