BC Reservation | పోరాటాల ద్వారా నే మన హక్కుల్ని సాధించుకువాలి….
BC Reservation | కరీమాబాద్, ఆంధ్రప్రభ : బీసీ రిజర్వేషన్(BC Reservation)లకోసం సాయి ఈశ్వర చారి ఆత్మహుతి చేసుకుని చికిత్స పొందుతూ మృతి చెందటం పట్ల తెలంగాణ ముదిరాజ్ మహాసభ పక్షాన మా ప్రఘాడ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నామని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ (Dr. Banda Prakash)అన్నారు.
ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. బీసీలు అందరు మన హక్కుల కోసం ఉద్యమించి పోరాటాల ద్వారానే రిజర్వేషన్(Reservation) అయినా అలాగే ఏ హక్కులనైనా సాధించుకోగలమని, విద్యార్థులు, యువకులు, రిజర్వేషన్ ల విషయంలో పార్టీలు మోస పూరితంగా వాగ్దానాలు చేస్తూ మనల్ని మభ్య పెడుతూ మోసం చేస్తున్నా… ఆవేదనతో ఆవేశానికి లోనుకాకుండా సంయమనం పాటించాలని కోరారు. ప్రణాళికా బద్ధంగా, వ్యూహంతో కలసికట్టుగా బీసీలు అందరూ పోరాడి హక్కులు సాధించుకోవాలని కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు.

