Bus Stand | తోపుడు బండ్లపై దూసుకెళ్లిన‌ కారు

Bus Stand | తోపుడు బండ్లపై దూసుకెళ్లిన‌ కారు

  • పలువురి మహిళలకు గాయాలు
  • నెల్లూరు నగరం మద్రాస్ బస్టాండ్ వద్ద ప్రమాదం

Bus Stand | నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : వేగంగా వెళ్తున్న కారు రోడ్డు పక్కన తోపుడు బండ్లపై దూసుకెళ్ల‌డంతో పలువురు మహిళలకు గాయాలైన సంఘటన ఈ రోజు నెల్లూరులో చోటు చేసుకుంది. నగరంలోని మద్రాస్ బస్టాండ్ కూరగాయల మార్కెట్ వద్ద బండ్ల‌పై పండ్లు, కూరగాయలు, పూల వ్యాపారులు చేసేవారు ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఓ కారు అదుపు తప్పి ఈ తోపుడు బండ్లను ఢీకొంది. దీంతో బండ్లు ధ్వంసమ‌య్యాయి. అక్క‌డే ఉన్న పలువురు మహిళలకు గాయాలు కాగా వారిని చికిత్సకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply