Bansuada | గ్రామాల అభివృద్ధికి కలిసి పనిచేద్దాం

Bansuada | గ్రామాల అభివృద్ధికి కలిసి పనిచేద్దాం


Bansuada | బోధన్, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన‌ సర్పంచులను నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సహకార బ్యాంక్ మాజీ అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి (Pocharam Bhaskar Reddy) అభినందించారు. బాన్సువాడ నియోజకవర్గంలో మొదటి విడత ఎన్నికల సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన వర్ని, చందూర్, మోస్రా, పోతంగల్, కోటగిరి మండలాల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఐదు మండలాల్లో 15గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. వీరిని పోచారం భాస్కర్ రెడ్డి అభినందించారు. గ్రామాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.

Leave a Reply