Elur | యువ‌తిపై రౌడీషీట‌ర్ల అత్యాచారం

Elur | యువ‌తిపై రౌడీషీట‌ర్ల అత్యాచారం


వివ‌రాలు వెల్ల‌డించిన ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్

Elur | ఏలూరు క్రైమ్, ఆంధ్రప్రభ : ఏలూరు రెండో పట్టణ పరిధిలో ఈ రోజు టూటౌన్ పోలీస్ స్టేషన్ (Police Station) పరిధిలో ఓ యువతిపై హత్యాచారం జరిగింది. నిందితులు జగదీశ్, భవాని కుమార్ అనే వ్యక్తులపై రౌడీ షీట్‌ తోపాటు సుమారు 10 కేసులు ఉన్నాయని తెలిపారు. నిందితుడు జగదీష్ మంగళగిరిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 2వ తేదీన ఒక చోరీ కేసులో కోర్టుకు హాజరు కావడానికి జగదీష్ ఏలూరు వచ్చాడు. ఇదే నేపథ్యంలో ఏలూరు రెండవ పట్టణ ప్రాంతానికి చెందిన ఓ యువతితో అతనికి అక్రమ సంబంధం ఉండేది.

పాత పరిచయాల నేపథ్యంలో ఆమె ఇంటికి వెళ్లి నిందితులు జగదీష్, భవాని కుమార్ (Bhavani Kumar) ఘర్షణకు దిగారు. ఘర్షణ పెరగడంతో అక్కడే ఉన్న వేరే యువతిని బలవంతంగా అర్ధరాత్రి ఒంటిగంటకు జగదీష్ హత్యాచారానికి పాల్పడ్డాడు. ఏలూరు రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో 3వ తేదీన బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు.. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి యువతిని వైద్య చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితులు జగదీష్, భవాని కుమార్‌లను త్వ‌ర‌లో అరెస్ట్ చేస్తామని డీఎస్పీ శ్రావణ్ కుమార్ హెచ్చరించారు.

Leave a Reply