Year 2000 | దత్తాత్రేయ జయంతి వేడుకలు ..

Year 2000 | దత్తాత్రేయ జయంతి వేడుకలు ..

Year 2000 | రెంజల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని కల్యాపూర్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో దత్తాత్రేయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు ఆడ, మగ అనే తేడా లేకుండా ఆలయం వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు చేపట్టారు.

దత్త పౌర్ణమి సందర్భంగా ఆలయం వద్ద యజ్ఞం, స్వామి వారికి అభిషేకం, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వాహాకులు నిర్వహించారు. కల్యాపూర్ గ్రామంలో మాత్రమే ఆలయం ఉందని, ఈ మందిరం 2000 సంవత్సరం(Year 2000)లో నిర్మించడం జరిగిందని తెలిపారు. గ్రామ పెద్దలు పోశెట్టి, గంగాధర్, హనుమంత్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గాండ్ల నాగరాజ్, శంకర్, వెంకటి, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

మండలంలోని సాటాపూర్ శ్రీ శ్రీ శ్రీ నాగ లింగేశ్వర ఆలయం(Sri Sri Sri Nagalingeswara Temple) దత్తాత్రేయ జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తండోప తండాలుగా భక్తులు తరలివచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులను చెల్లించుకున్నారు. నిర్వాహాకులు భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ పెద్దలు లక్ష్మీ నరసయ్య గౌడ్, దాసరి గంగాధర్, ఆలయ పూజారి మటపతి నాగనాథ్ అప్ప, సుంకరి చిన్న, మేదరి పోశెట్టి, అనుదీప్ పాల్గొన్నారు.

Leave a Reply