201 couples | సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు..
201 couples | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని గూడెం శ్రీరమ సహిత సత్యనారాయణ స్వామి(Satyanarayana Swamy) దేవస్థానం మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని ఈ రోజు స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుండి అధిక సంఖ్యలో చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నారు.
భక్తులు ముందుగా దగ్గర ఉన్న గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి గూడెం గుట్టపై సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం 201 మంది దంపతులు(201 couples) స్వామి వారి వ్రతములు చేసుకున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో 600 మంది భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

