Agricultural Products | గో ఆధారిత సమగ్ర సుస్థిర వ్యవసాయ రంగంలో…

Agricultural Products | గో ఆధారిత సమగ్ర సుస్థిర వ్యవసాయ రంగంలో…

Agricultural Products | కొత్తకోట, ఆంధ్రప్రభ ; మహాకిసాన్ మేళా 2025 పురస్కరించుకొని రైతు రత్న అవార్డును డాక్టర్ ఎద్దుల రాజవర్ధన్ రెడ్డి(Dr. Eddula Rajavardhan Reddy) అందుకున్నారు.

రాష్ట్రంలో గో ఆధారిత సమగ్ర సుస్థిర వ్యవసాయ రంగంలో ఉత్తమ ఫలితాలు అందిస్తున్న ఎద్దుల రాజవర్ధన్ రెడ్డికి తెలంగాణ అగ్రికల్చర్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌(Officers Association) ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి.చిన్నారెడ్డి ఆయనకు ‘రైతు రత్న’ అవార్డును గురువారం హైదరాబాద్ లో ప్రదానం చేశారు.

ఈసందర్భంగా రైతురత్న డాక్టర్ ఎద్దుల రాజవర్ధ మాట్లాడుతూ… గో ఆధారిత సమగ్ర సుస్థిర వ్యవసాయంలో పశువుల వ్యర్థాలను ఉపయోగించి నేల సారవంతాన్ని పెంచుతూ, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, వివిధ పంటలను ఒకేసారి పండించే ఒక వ్యవసాయ పద్ధతిగా పేర్కొన్నారు. ఈ విధానంలో పశువుల ఎరువు(Cattle Manure), మూత్రం వంటివాటిని సహజ ఎరువులుగా ఉపయోగించడం ద్వారా రసాయనాల వాడకాన్ని తగ్గించవచ్చని, దీనివల్ల నేల సారం మెరుగుపడి, కలుపు మొక్కలు, తెగుళ్ళను అదుపు చేస్తుందన్నారు.

సమగ్ర వ్యవసాయం ద్వారా పంటలతో పాటు పశుపోషణ వంటి ఇతర వ్యవసాయ కార్యకలాపాలను సమన్వయం చేయవచ్చని.. ప్రకృతి సిద్ధమైన విధానంలో రసాయన ఎరువులు పురుగుమందుల వాడకాన్ని తగ్గించి, సహజ పదార్థాలను ఉపయోగించడం వల్ల అధిక దిగుబడి వస్తుందన్నారు.

ఈ వ్యవసాయంలో పశువుల వ్యర్థాలను ఉపయోగించి నేల భౌతిక నిర్మాణాన్ని, పోషకాలను మెరుగుపరచడమే కాకుండా ఒకే భూమిలో వేర్వేరు ఎత్తుల్లో, వివిధ రకాల పంటలను ఒకేసారి పండించవచ్చన్నారు. అంతేకాకుండా పశువుల ద్వారా వచ్చే ఆదాయం వ్యవసాయ ఉత్పత్తుల(Agricultural Products) ద్వారా రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తూ రసాయన ఎరువులు వాడకపోవడం కాలుష్యం తగ్గించి పర్యావరణం రక్షించబడుతుందన్నారు.

ముఖ్యంగా సహజ పద్ధతుల వల్ల నేల సారవంతం పెరిగి, దీర్ఘకాలంలో వ్యవసాయానికి మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి.చిన్న రెడ్డి, రాష్ట్ర అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply