Ditwah Effect | రైతుల ఆందోళన..

Ditwah Effect | రైతుల ఆందోళన..
Ditwah Effect, ఉంగుటూరు, ఆంధ్రప్రభ : ఉంగుటూరు మండలం ఎలుకపాడులో దిత్వా ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పొలాల్లోకి నీరు చేరింది. దీంతో వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నీటిలో ఎక్కువ రోజులు ఉంటే పంటకు మొలకలు వచ్చే అవకాశం ఉందని, ఫంగస్ పడుతుందని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. పొలాల్లో నీరు తగ్గే సూచనలు లేకపోవడంతో పంట నష్టం పై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పరిస్థితిని పరిశీలించి, సహాయ చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
