OFFICE | డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ కి సన్మానం

OFFICE | డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ కి సన్మానం


OFFICE | కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : ఇటీవలే ఆర్మూర్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ వో (HO)గా పదోన్నతి పొంది పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ ఎన్. రవీందర్ ని వారి కార్యాలయంలో కమ్మర్ పల్లి మండల అంబెద్కర్ (Ambedkar) యువజన సంఘం ఆధ్వర్యంలో కలిసి పూలమాల, శాలువాలతో మంగళవారం ఘనంగా సన్మానించారు.
ఈసందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సుంకరి విజయ్ కుమార్ (Sunkari Vijay Kumar) మాట్లాడుతూ… డాక్టర్ రవీందర్ వైద్య రంగంలో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించి, అనేక కుటుంబాలకు ఆసరాగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అంబెద్కర్ యువజన సంఘం కార్యవర్గ సభ్యులు దాసరి రాకేష్, వినయ్, ఆంజనేయులు, అనిల్, అమర్, చందు, శ్రవణ్, నరేశ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply