Makthal | వైభవంగా అయ్యప్పస్వామి కలశ ఊరేగింపు

Makthal | వైభవంగా అయ్యప్పస్వామి కలశ ఊరేగింపు
అయ్యప్ప స్వాముల కలశ ఊరేగింపు
Makthal | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గురుస్వాములు అశోక్ గౌడ్, తాళంపల్లి అనిల్ ఆధ్వర్యంలో కలశ (Kalash) ఊరేగింపు వైభవంగా కొనసాగింది. పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాల సందర్భంగా నూతనంగా పునరుద్ధరించబడిన పుష్కరిణి( కోనేటి) నుండి పవిత్ర జలాలతో మేళతాళాల మధ్య అయ్యప్ప ఆలయానికి కళాశాలతో ఊరేగింపు నిర్వహించారు.
ఈ సందర్భంగా గురుస్వాములు మాట్లాడుతూ… ఈ పవిత్ర జలాలతో అయ్యప్ప స్వామికి (Lord Ayyappa) అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా ఈనెల 3, 4న కూడా ఈ మూడు రోజులపాటు గుడిలో విశేష కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మక్తల్ సన్నిదానం అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.
