నంద్యాల బ్యూరో, ఫిబ్రవరి 24 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సోమవారం సాయంత్రం నంద్యాల జిల్లా, శ్రీశైలం దేవస్థానంలో పర్యటించనున్నారు. ఆయన రాక సందర్భంగా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తో కలిసి జిల్లా ఇంచార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ (ఐపియస్) సున్నిపెంట హెలీప్యాడ్ వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతరం స్పెషల్ పార్టీ పోలీసులకు తగు సూచనలు చేశారు. శ్రీశైల అటవీ ప్రాంతం పరిధిలో స్పెషల్ బెటాలియన్ పోలీసులను కూడా రంగంలోకి దించారు. అడిషనల్ ఎస్పీ చంద్రబాబు, శ్రీశైలం సీఐ జి.ప్రసాదరావు తదితరులున్నారు.