Checking | అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను తనిఖీ

Checking | వాంకిడి, ఆంద్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంగా జిల్లా ఎస్పీ నితిక పంత్ అంతర్రాష్ట్ర సరిహద్దులో వాంకిడి మండలంలో ఏర్పాటు చేసిన ఎస్‌.ఎస్‌.టీ (ఇంటర్ స్టేట్ చెక్‌పోస్ట్) ను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలకు సంబంధించిన రిజిస్టర్‌లను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్‌పోస్ట్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి, విధుల్లో ఉన్న సిబ్బంది సరైన డ్యూటీ రోస్టర్ ప్రకారం క్రమబద్ధంగా పనిచేయాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో అక్రమ డబ్బు, అక్రమ మద్యం ఇతర నిషేధిత వస్తువుల రవాణా అయ్యే అవకాశం ఉంటుందని, చెక్‌పోస్ట్ లో డ్యూటీలో ఉన్నఅధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రతీ వాహనం, వ్యక్తిని కచ్చితంగా, క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే వదిలిపెట్టాలని సూచించారు.

అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ ఆదేశించారు. ఎన్నికలను స్వచ్ఛంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అహర్నిశలు కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఏ విధమైన రవాణా జరగకుండా కట్టుదిట్టమైన తనిఖీలు కొనసాగించాలని ఎస్పీ నితిక పంత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో ఎస్పీ వెంట వాంకిడి సీఐ సత్యనారాయణ పాల్గొన్నారు.

Leave a Reply