TG| కొత్త ఎఫ్ఐఆర్‌ను ఖండించిన సుగుణక్క

TG| తిర్యాణి, ఆంధ్రప్రభ : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన తాజా ఎఫ్ఐఆర్‌ (FIR) ను టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, కుమురంభీమ్ ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క(Athram sugunakka) తీవ్రంగా ఖండించారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.

దేశ ప్రజలకోసం ప్రాణాలర్పించిన గాంధీ కుటుంబంపై కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. దేశంలో పెరుగుతున్న ప్రజాభిమానం, కాంగ్రెస్ పార్టీ(congress party) పై పెరుగుతున్న మద్దతుతో భయభ్రాంతులకు గురైన కేంద్ర‌ ప్రభుత్వం(govt), అభద్రతా భావంతో త‌మ అగ్రనేతలను టార్గెట్(target) చేస్తుందని సుగుణక్క మండిపడ్డారు.

ప్రజలను మోసం చేయడంలో విఫలమైన బీజేపీ, దేశ ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇలాంటి కేసులు సృష్టిస్తోందని సుగుణక్క వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి బెదిరింపులు(Threats) పనిచేయవని, కాంగ్రెస్ పార్టీ మరింత ఉత్సాహంతో ప్రజా సమస్యల కోసం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

Leave a Reply