GAME | కడప బిడ్డ హాకీ స్టిక్.. ఈ చరిత

GAME | కడప బిడ్డ హాకీ స్టిక్.. ఈ చరిత
నేషనల్ హాకీ టోర్నీకి రెడీ
GAME | పులివెందుల అర్బన్, ఆంధ్రప్రభ : తిరుపతి జిల్లా చంద్రగిరి లో నవంబర్ నెల 22 నుండి 25వ తేదీ వరకు జరిగిన 69 వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్ జి ఎఫ్) అండర్ 14 అమ్మాయిల హాకీ టోర్నమెంట్ లో వైఎస్సార్ కడప జిల్లా (YSR Kadapa District) హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన శ్రీ విద్యాధరి హైస్కూల్ లో 7వ తరగతి చదువుతున్న ఎన్. చరిత అద్భుత ప్రతిభ కనబరిచి ఆంధ్రప్రదేశ్ అండర్ 14 హాకీ జట్టుకు ఎంపికైంది. స్కూలు సీఈవో భాను ప్రకాష్, కరెస్పాండెంట్ నాగరాజు లు హర్షం వ్యక్తం చేశారు. డిసెంబర్ 22 నుంచి 27వ తేదీ వరకు మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఎస్ జీఎఫ్ ఆధ్వర్యంలో నేషనల్ హాకీ టోర్నీలో అండర్ 14 ఆంధ్రప్రదేశ్ టీమ్ తన సత్తాను చాటనుంది. ఇక కడప బిడ్డ ఎన్. చరిత రాష్ట్ర జట్టుకు ఎంపికై నేషనల్ టోర్నీలో ఆడటానికి వెళ్తోంది, ఈ సందర్భంగా శ్రీ విద్యాధరి స్కూల్ ప్రిన్సిపాల్ జాకీర్ హుస్సేన్, ఉపాధ్యాయులు, విద్యార్తులు శుభాభివందనాలు తెలిపారు.
