Bhupalapalli | రాజలింగమూర్తి హత్య – ఏడుగురి అరెస్ట్
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి :జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని రెడ్ది కాలనీలో ఈ నెల 19 రాత్రి సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసుకు సంబందించిన వివరాలను ఆదివారం జిల్లా పోలీసు కార్యలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే వెల్లడించారు.
భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా వున్న ఎకరం భూ తగదా విషయంలో ఈ హత్య జరిగినట్లు తెలిపారు. నిందితులు రాజలింగమూర్తి కంట్లో కారం చల్లి రాడ్లతో దాడి చేసి కత్తులతో పొడిచి చంపారని తెలిపారు. హత్య ఘటనలో 10మందిపై కేసు నమోదు కాగా 7గురు వ్యక్తులు భూపాలపల్లి కి చెందిన రేణుకుంట్ల సంజీవ్, పింగిలి సేమంత్, మోరే కుమార్, కొత్తూరి కిరణ్, రేణికుంట్ల కొమురయ్య, దాసారపు కృష్ణ, రేణికుంట్ల సాంబయ్య లను అరెస్టు చూపారు.
మరో ముగ్గురు వ్యక్తులు భూపాలపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, పుల్ల సురేష్, పుల్ల నరేష్ లు పరారీలో ఉన్నట్లు త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.
ఈ సమావేశంలో భూపాలపల్లి డిఎస్పి సంపత్ రావు, భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్, చిట్యాల సిఐ మల్లేష్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, భూపాలపల్లి గణపురం, రేగొండ, టేకుమట్ల ఎస్సై లు సాంబమూర్తి, రమేష్, అశోక్, సందీప్, సుధాకర్, రాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.