Dr. BR Ambedkar | ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

Dr. BR Ambedkar | ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
Dr. BR Ambedkar | కడెం, ఆంధ్రప్రభ : కడెం మండల కేంద్రంలో భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కడెంలో గల భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్(Dr. BR Ambedkar) విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పెద్దూర్ జీపీ మాజీ సర్పంచ్ చిట్యాల చిన్నయ్య(Chityala Chinniah), తెలంగాణ ఎస్సీ ఎస్టి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు బీ రాజేష్ నాయక్, కడం ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు రాజన్న, మామిడి స్వామి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు వాజిద్ ఖాన్ చాంద్ పాషా పెద్దూర్(Wajid Khan Chand Pasha Peddur), మాజీ ఎంపీటీసీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
