America | భగవద్గీత సాక్షిగా ఎఫ్ బి ఐ డైరెక్టర్ గా పటేట్ ప్రమాణ స్వీకారం
వాషింగ్టన్ – అమెరికా ప్రతిష్ఠాత్మక దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా భారతీయ సంతతికి చెందిన కాష్ పటేల్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి సంబంధించిన తీర్మానానికి సెనెట్ ఆమోదం తెలిపింది. రెండు ఓట్ల తేడాతో ఈ తీర్మానం ఆమోదం పొందింది. అనంతరం ఆయన ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా బాధ్యతలను స్వీకరించారు. రాజధాని వాషింగ్టన్‌లోని వైట్ హౌస్ ఐషెన్‌హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ బిల్డింగ్ ఇండియన్ ట్రీటీ రూమ్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బొండి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. భగవద్గీత సాక్షిగా కాష్ పటేల్ ప్రమాణం చేయడం విశేషం
బాధ్యతలను స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడాతూ,. అమెరికన్లు కలగన్నట్టుగా ఈ వ్యవస్థను తీర్చిదిద్దుతానని, ప్రజల్లో కోల్పోయిన విశ్వాసాన్ని మళ్లీ కల్పిస్తానని అన్నారు. ప్రపంచంలోనే అతి గొప్ప దేశం.. అందులో ఎఫ్‌బీఐ వంటి సంస్థకు నాయకత్వాన్ని వహించబోతోండటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఒక భారతీయుడిగా గర్వపడుతున్నానని వ్యాఖ్యానించారు.
ఐ లవ్ కాష్ పటేల్ – ట్రంప్
ఎఫ్బిఐ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ, కొత్త డైరెక్టర్ కాష్ పటేల్‌ను అభినందించారు ఎఫ్‌బీఐపై ఆయనకు ఉన్న మమకారాన్ని ప్రస్తావించారు. ఏజెంట్లు అంటే ఎంతో గౌరవిస్తారని వ్యాఖ్యానించారు. ఐ లవ్ కాష్ పటేల్ అంటూ కామెంట్ చేశారు. ఎఫ్‌బీఐ అంటే అంకితభావం ఉందని, అందుకే ఆయనను డైరెక్టర్‌గా నియమించానని అన్నారు. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ పేరును గతంలోనే ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. ఇలాంటి పదవులకు సంబంధించిన నియామకాలను సెనెట్ ఆమోదించాల్సి ఉంటుంది. తాజాగా ఈ తీర్మానంపై సెనెట్‌లో ఓటింగ్ నిర్వహించారు. 51-49 ఓట్ల తేడాతో ఈ తీర్మానం ఆమోదం పొందింది.