Tirupathi | నిధుల స్వాహా – భార్యాభర్తలకు జైలు శిక్ష
తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : తిరుపతిలోని బాలాజీ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు లో అకౌంటెంట్, క్యాషియర్ గా పనిచేస్తూ దేళ్లక్రితం రికార్డులను తారుమారు చేసి రూ కోటి 13 లక్షల నిధులు కాజేసిన నేరంపై అరెస్టు అయిన భార్యాభర్తలకు ఈరోజు తిరుపతి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది.
పోలీసుల కధనం మేరకు ఈ కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి బాలాజీ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లో పని చేస్తున్న అకౌంటెంట్ గా , క్యాషియర్ గా పనిచేస్తున్న డి నాగమణి, నాగరాజు బాబు లపై 2002 – 2006 సంవత్సరాల మధ్యకాలం పెద్ద ఎత్తున నిధుల గోల్ మాల్ చేశారనే కేసు నమోదైంది వారిద్దరినీ రికార్డులను తారుమారు చేయడం ద్వారా రూ 1,13,39,000/- కాజేసి వాడుకున్ననేరంపై ఆ బ్యాంకు మేనేజర్ మునిరామయ్య పిర్యాదు చేశారు, ఆ మేరకు 2008 లో ఐ పి సి 409, 420 120(b), 464 477 (ఎ ) సెక్షన్ ల కింద తిరుపతి క్రైం పోలీసులు అరెస్టు చేశారు ఆ కేసు ని విచారించిన తిరుపతి 5 వ అడిషనల్ సివిల్ గౌరవ జడ్జి జస్టిస్ వై .సరిత ఈరోజు వారిద్దరికీ శిక్షలు విధిస్తూ తీర్పునిచ్చారు.
ఆ మేరకు కేసు లోని మొదటి ముద్దాయి అయిన డి .నాగమణి వారికి 2 సం.ల జైలు శిక్ష , 10 వేల రూపాయల జరిమానా డబ్బులుచెల్లించని యెడల 6 నెలల జైలు శిక్ష, రెండవ ముద్దాయి డి .ఎస్ . నాగరాజు బాబు కి 1 సం. జైలు శిక్ష, 10 వేల రూపాయల జరిమానా, చెల్లించని యెడల 6 నెలల, జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు అభినందించారు