TG | పండుగ వేళ మ‌రో గుడ్ న్యూస్..

  • 24 గంట‌ల వెసులుబాటు
  • వారికి రెట్టింపు వేత‌నం

రంజాన్‌ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రంజాన్‌ మాసంలో 24 గంటలూ దుకాణాలు తెరిచేలా రేవంత్‌ సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది. రంజాన్‌ మాసంలో మార్చి 2వ తేదీ నుంచి 31 వరకు 24 గంటల పాటు దుకాణాలు తెరవవచ్చని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు సీఎస్ శాంతి కుమారి ఆదేశాలు జారీచేశారు.

దానికి తోడు… రోజుకు 8 గంటలు లేదా వారానికి 48 గంటలకు పైగా పనిచేసే సిబ్బందికి రెట్టింపు వేతనాలు ఇవ్వాలని నిర్ణయించింది. అదే విధంగా.. మహిళ ఉద్యోగులు ఉంటే వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చర్యలు తీసుకొవాలని పేర్కొంది. ఈ మేరకు సంబంధిత శాఖలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

జీవో 476ను తప్పనిసరిగా పాటించాలని అధికారులు ఆదేశించారు. రంజాన్ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రంజాన్ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply