Accident | మరో బస్సు ప్రమాదం..

Accident | మరో బస్సు ప్రమాదం..

Accident, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నంద్యాల జిల్లాలో అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ సమీపంలో మైత్రీ ట్రావెల్స్ బస్సు (Travel bus) ముందు వెళుతున్న లారీని ఢీ కొట్టింది. ఆ వెంటనే వెనకాల వస్తున్న మరో లారీ ఆగిన బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో వెనకభాగంలో కూర్చొన్న ఇద్దరు ప్రయాణికులు అక్కడిక్కడే మరణించారు. 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఆళ్లగడ్డ మండలం పేరాయపాలెం మెట్ట వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన టైమ్ లో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతులు బద్రినాథ్, హరితగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిని క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ సునీల్ షేరాన్ సహాయ కార్యక్రమాలు చేపట్టారు.

Leave a Reply