TG | పీవీ వెటర్నరీ యూనివర్సిటీ వీసీగా మంతని జ్ఞాన ప్రకాష్
- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఎట్టేకేలకు పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీకి ఉపకులపతిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వీసీ నియామకం విషయంలో చాలా కాలంగా జరుగుతున్న జాప్యానికి ఫుల్ స్టాప్ పెట్టింది. వెటర్నరీ వర్సిటీ వీసీగా మంతని జ్ఞాన ప్రకాశ్‌ను నియమించింది.
వీసీ నియామక విషయంలో రెండు సార్లు సెర్చ్ కమిటీలు భేటీ అయినా ఎంపిక ప్రక్రియ ముందుగు సాగలేదు. రాష్ట్రంలోని దాదాపు అన్ని యూనివర్సిటీలకు ఒకే రోజు వీసీలను ఎంపిక చేశారు. ఆ జాబితాలో వెటర్నరీ వర్సిటీ వీసీ పేరు కనిపించలేదు. తాజాగా వెటర్నరీ వీసీ బాధ్యతలను మంతని జ్ఞాన ప్రకాశ్‌కు అప్పగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది.