Bikkanur | పెళ్లి మంటపంలో విషాదం – కన్యాదానం చేస్తుండగా గుండెపోటుతో తండ్రి మృతి
బిక్కనూర్ ఫిబ్రవరి 21 ఆంధ్రప్రభ…. బంధుమిత్రులు కుటుంబ సభ్యుల ఆనందోత్సవాల మధ్య జరుగుతున్న వివాహ వేడుకల్లో విషాదఛాయలు చోటు చేసుకున్నాయి దీంతో అక్కడ పెళ్ళికి మోగవలసిన భాజా భజంత్రీలు మూగపోయాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని రామేశ్వర పల్లి గ్రామానికి చెందిన కుడిక్యాల బాలచంద్రంకు ఇద్దరు కూతుళ్లు ఉండగా పెద్ద కూతురు కనక మహాలక్ష్మి వివాహం మండల పరిధిలోని బేసిక్ ప్రాంతంలో విశాలమైన ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అక్కడ బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల మధ్య వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కన్యాదానం చేస్తున్న సమయంలో బాలచంద్రంకు గుండెపోటు వచ్చింది.
వెంటనే అక్కడ ఉన్న బంధుమిత్రువులు గమనించి ఆయనను కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికీ ఆయన మృతి చెందినట్లు వైద్యులు, ధ్రువీకరించారు
దీంతో కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో మండపంలో విషాదఛాయలు చేసుకున్నాయి. అక్కడ మంటపంలో కార్యక్రమాలను హుటాహుటిన ముగించుకున్నారు. మండపంలో ఉన్న ప్రతి ఒకరు కంటతడి పెడుతూ మృతుని ఇంటికి తరలి వెళ్లారు. మృతుడు కామారెడ్డి పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పనిచేస్తున్నారు, పచ్చని పందిరిలో ఆనందోత్సవాల మధ్య కూతురు పెళ్లి జరుపుతుండగా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం తెలియజేశారు.