POLICE | నూతన ఎస్పీగా శ్రీ నితికా పంత్

POLICE |నూతన ఎస్పీగా శ్రీ నితికా పంత్
POLICE | ఆసిఫాబాద్, ఆంధ్రప్రభ : కోమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా (Asifabad District) నూతన ఎస్పీ శ్రీ నితికా పంత్ శనివారం రోజునజిల్లా పోలీస్ కార్యాలయంలో ముందుగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించి, అనంతరం ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారికి జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చాలు అందజేశారు.
సందర్భముగా ఎస్పీ మాట్లాడుతూ
గతంలో సంగారెడ్డి ఏఎస్పీగా, మేడ్చల్ డి.సి.పి గా, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ (Task Force) డీసీపీగా, ఆదిలాబాద్ బెటాలియన్ కమాండెంట్‌గా విధులు నిర్వహించిన శ్రీ నితికా పంత్ ప్రస్తుతం కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు.
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ (Police Department) పూర్తిగా కట్టుబడి ఉందని ఎస్పీ పేర్కొన్నారు.
సామాన్య ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి, వారి సమస్యలను చట్టపరంగా పరిష్కరించడం పోలీసుల ప్రధాన లక్ష్యమన్నారు.
నిషేధిత మత్తు పదార్థాలు, అక్రమ కార్యకలాపాలు, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు (Strict Measures) తీసుకుంటామని స్పష్టం చేశారు.
శాంతి భద్రతలకు (For Peace And Security) విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. బాలికలు మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు.
సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని వ్యక్తిగత, మతపరమైన దూషణలు చేయడం, తప్పుడు ప్రచారం (False Propaganda) చేయడం, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు.
జిల్లాలో శాంతి భద్రతలు దెబ్బతినేలా ప్రవర్తించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని నితికా పంత్ వెల్లడించారు.
