POSTER| శాంతియుత ధర్నాను విజయవంతం చేయాలి..

- బీసీ జనసభ జిల్లా నాయకుడు పుట్ట వీరేష్ యాదవ్
POSTER| ప్రతినిధి యాదాద్రి, ఆంధ్రప్రభ: ఈనెల 24న బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ముందు నిర్వహించే శాంతియుత ధర్నాను విజయవంతం చేయాలని బీసీ జనసభ జిల్లా నాయకుడు పుట్ట వీరేష్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం భువనగిరి పట్టణంలోని రాఘవేంద్ర హోటల్ లో శాంతియుత గోడ పోస్టర్లను ఆవిష్కరించారు. కులాలకు, బీసీ సంఘాలకు అతీతంగా శాంతియుత ధర్నాను దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు.
రాజ్యాంగ సవరణ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్, బీజేపీలదేనని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహించాలన్నారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నిక నిర్వహిస్తే రాష్ట్రం అగ్నిగుండమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా నాయకుడు నక్కల చిరంజీవి యాదవ్, పద్మశాలి సంఘం యువజన జిల్లా అధ్యక్షుడు మిర్యాల శ్రీనివాస్, మేదరి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొత్త ఆంజనేయులు, యాదవ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గుండబోయిన సురేష్ యాదవ్, మాజీ ఎంపీటీసీ రసాల మల్లేష్ యాదవ్, శ్రీరాం శరత్ యాదవ్, నవీన్ యాదవ్, పబ్బతి హరీ కృష్ణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
