PENSIONS| అర్హత గల దివ్యాంగులకు పెన్షన్లు అందిస్తాం..

PENSIONS| శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : పెన్షన్లు కోసం అర్జీలు పెట్టుకున్న అర్జీదారులకు అర్హతలు ఉన్న వారికి సత్వరమే పెన్షన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులకు తెలిపారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్వాభిమాన్ దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ లో కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైని కలెక్టర్ పృథ్వి రాజ్, వికలాంగుల శాఖ ఇన్ చార్జ్ ఎ.డీ.బీ. షైలజ, అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ.. ప్రతీ మూడవ శుక్రవారం స్వాభిమాన్ దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నిర్వహించే 12వ శుక్రవారం గ్రీవెన్స్ కు 11 అర్జీలు స్వీకరించినట్లు వివరించారు.

ఇందులో హౌసింగ్ కు సంబంధించినవి 3 అర్జీలు, పెన్షన్ మంజూరు కోరుతూ 2, ఉద్యోగం అవకాశం కల్పించవలసినదిగా కోరుతూ 2, సదరన్ సర్టిఫికెట్ కోసం 2, విద్యాశాఖకు సంబంధించి 1 అర్జీ వచ్చిందని, వచ్చిన అర్జీలను స్వయంగా పరిశీలించి తదుపరి పరిష్కారం కొరకు సంబంధించిన శాఖ అధికారులకు తగు ఆదేశాలిచ్చారు. పెన్షన్లు, ఉద్యోగం,సదరం సర్టిఫికెట్, ఇల్లు మంజూరు కోరుతూ వచ్చే అర్జీలలో పూర్తిగా అర్హతలు పరిశీలించి పరిష్కరించాలని తెలిపారు. ప్రతీ నెల మూడవ శుక్రవారం నిర్వహిస్తున్న స్వాభిమాన్ రోజునే ఉద్యోగుల గ్రీవెన్స్ ఉంటుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. అర్జీలు స్వీకరణలో జిల్లా పరిషత్ సీఈఓ సత్య నారాయణ పాల్గొన్నారు. స్వాభిమాన్ లో వైద్య ఆరోగ్య శాఖ, రిమ్స్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply