AFG vs SA | శతకొట్టిన రికెల్టన్.. ఆఫ్ఘాన్ ముందు భారీ టార్గెట్ !
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈరోజు ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన సౌతాఫ్రికా భారీ స్కోర్ నమొదు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 315 పరుగులు సాధించింది.
కాగా, ఆ జట్టు ఓపెనర్ యువ ఆటగాడు రియాన్ రికెల్టన్ (103) తొలి వన్డే సెంచరీని సాధించాడు. ఆఫ్ఘాన్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కంటూ శతకొట్టాడు. ఇక కెప్టెన్ టెంబ బావుమా(58), రాస్సీ వాన్ డెర్ డుసెన్ (52) లు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఆఖరి ఓవర్లలో ఐడెన్ మార్క్రామ్ (36 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ 52 నాటౌట్), వియాన్ ముల్డర్ (6 బంతుల్లో 12 ఒక పోరు, సిక్స్) బౌండరీలతో బెంబేలెత్తించారు.
ఆఫ్ఘాన్ బౌలర్లలో మహమ్మద్ నబీ రెండు వికెట్లు పడగొట్టగా.. ఫజల్హక్ ఫరూఖీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, నూర్ అహ్మద్ తలో వికెట్ దక్కించుకున్నారు.