FARMER| గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ రూరల్ మండలంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము లింగవరం గ్రామంలో ఆర్.ఎస్.కె వద్ద జరుగుతున్న ప్యాడి ప్రొక్యూర్మెంట్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా వెనిగండ్ల రాము అడిగి తెలుసుకున్నారు. రైతులు సంచులు, ట్రాన్స్పోర్ట్ వెహికల్ కొరత ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకోని రావడంతో.. అధికారులు ఎమ్మార్వో కిరణ్, గుడివాడ ఆర్టీవో శ్రీనివాస్ తో మాట్లాడి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ రోజు అందుబాటులో ఉండాలని, ఈ సమయంలో రైతులకు అధికారులు సహకరించాలని ఆదేశించారు.
రైతుల కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని రైతులను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టి ఆర్ఎస్కే నుంచి మిల్లులకు ధాన్యం చేరిన 24 గంటల్లోపే రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తారని తెలిపారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే.. రైతులు తన దృష్టికి తీసుకురావాలని తక్షణమే చర్యలు చేపడతానని రైతులకు హామీ ఇచ్చారు. జనసేన పార్టీ గుడివాడ ఇంఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, తెలుగుదేశం పార్టీ రూరల్ పార్టీ ప్రెసిడెంట్ వాసే మురళి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జగన్మోహన్రావు, పండ్రాజు సాంబశివరావు, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు చిరంజీవి రెడ్డి, గోపాల స్వామి, మార్క్ రాజ్, కాటూరి ఏసుపాదం, తారక రామారావు, కలపాల మాణిక్యాలరావు, రవికుమార్, జగన్, బోనం నరేష్, సూర్యమోహనరావు, కోటయ్య, అగ్రికల్చర్ ఏడి, ఆర్ఎస్కే సిబ్బంది పాల్గొన్నారు.

