108 Ambulance | ఆకస్మిక అంబులెన్స్ తనిఖీ…

108 Ambulance | ఆకస్మిక అంబులెన్స్ తనిఖీ…
108 Ambulance | కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : కమ్మర్ పల్లి మండల కేంద్రంలో అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించే 108 అంబులెన్స్(108 Ambulance)ను 108కి సంబంధించిన ఉన్నత అధికారులు ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఉమ్మడి నిజమాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లాల ప్రోగ్రాం మేనేజర్ రామలింగేశ్వర రెడ్డి(Ramalingeswara Reddy) రికార్డులను తనిఖీ చేశారు. వాహనంలో ఉన్న మందులు, వైద్య పరికరాలు వాటి స్థితిగతులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాటి నిల్వలు చూసి రికార్డులను పరిశీలించారు.
అనంతరం మాట్లాడుతూ.. ప్రమాదాలు జరిగిన అత్యవసర పరిస్థితుల్లో అత్యవసర సేవలు అందించేందుకు సిబ్బంది ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని, గర్భిణులను ప్రసవ సమయంలో ఆసుపత్రికి అంబులెన్స్ లొనే తరలించేలా క్షేత్ర స్థాయి వైద్య సిబ్బందితో కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
నాణ్యమైన వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని సిబ్బందికి సూచించారు. అలాగే రికార్డులు పరిశీలించి సిబ్బంది పనితీరును అభినందించారు. సిబ్బంది ఈఎంటి సుంకరి విజయ్ కుమార్(EMT Sunkari Vijay Kumar), పైలట్ శ్రీనివాస్ ఉన్నారు.
